ఐఐటీ మండీలో నాన్ టీచింగ్ జాబ్స్.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చెయ్యచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… నాన్‌టీచింగ్ పోస్టులని భర్తీ చేస్తోంది. డిప్యూటీ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ మొదలైన పోస్టులు వున్నాయి.

jobs

రూ.35,000 నుంచి రూ.2,09,200 వ‌ర‌కు శాలరీ ఉంటుంది. ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 3, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. కనుక ఈ లోగా అప్లై చేసుకోవడం మంచిది. ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థికి స్క్రీనింగ్‌/స్కిల్/రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎంపికైతే ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, నోటిఫికేష‌న్ కోసం https://www.iitmandi.ac.in/administration/recruitment.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలలోకి వెళితే.. డిప్యూటీ రిజిస్ట్రార్,అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్, మెడిక‌ల్ ఆఫీసర్‌, అసిస్టెంట్ ఇంజ‌నీర్ (ఎల‌క్ట్రికల్‌), ఫిజిక‌ల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌ ఖాళీలు వున్నాయి. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే…

ఆన్‌లైన్ అప్లికేష‌న్ లింక్ https://oas.iitmandi.ac.in/instituteprocess/hr/Default.aspx ను క్లిక్ చేయాలి.
అక్కడ New Registration ఆప్ష‌న్‌పై క్లిక్ చెయ్యండి.
ద‌ర‌ఖాస్తుకు రూ.100 ఫీజు చెల్లించాలి.
అప్లికేష‌న్ పూర్త‌యిన త‌రువాత ద‌ర‌ఖాస్తు ఫాంను ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version