ఇప్పటికైనా గురుకులాల విలువ అర్థమైందా రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి పర్యటన లో ఓ బాలిక చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. ఈ వీడియో ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఆయన అర్థమైందా..? రేవంత్ రెడ్డి, గురుకులాల వల్ల ఎందరి జీవితాలు మారతాయో..? మీరు మా మీద ఫేక్ కేసుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు అవే పైసలను ఈ పేద పిల్లల మీద పెట్టండి.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహిళా సంఘం ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగానే నారాయణ పేట జిల్లా అప్పకపల్లి లో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. మహిళా సంఘాలను ఉద్దేశించి మాట్లాడారు. నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు చేశారు. డాక్టర్ చదువుతున్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ బాలిక తనకు డాక్టర్ కావడం ఒక కళ అని.. తాను గురుకుల పాఠశాలలో చదువుతూ డాక్టర్ కాగలనా..? అనే అనుమానం ఉండేదని.. కానీ గురుకుల పాఠశాలలో చదివి కూడా డాక్టర్ కావచ్చని ఇప్పుడు అనిపిస్తుందని చెప్పింది. తన గ్రామంలో మొట్టమొదటి డాక్టర్ చదువుతున్న వ్యక్తిని కూడా తానేనని సీఎం తో చెప్పింది.
అర్థమైందా @revanth_anumula గారు,
గురుకులాల వల్ల ఎందరి జీవితాలు మారతాయో? మీరు మా మీద ఫేక్ కేసుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు అవే పైసలను ఈ పేద పిల్లల మీద పెట్టండి, కొంచెం పుణ్యం అయినా దక్కుతుంది.@KCRBRSPresident pic.twitter.com/0MEvkHSJYR— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) February 21, 2025