రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్‌ రెడ్డి

-

యాదగిరిగుట్టకు సీఎం రేవంత్‌ రెడ్డి పయనం కానున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్‌ రెడ్డి వెళతారు. స్వర్ణగోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి… ఈ మేరకు కుటుంబంతో వెళ్లే ఛాన్స్‌ ఉంది. ఇక అటు… యాదగిరిగుట్టకు కేసీఆర్‌ కూడా వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

CM Revanth Reddy will go to Yadagirigutta tomorrow

యాదగిరిగుట్ట మహాకుంభాభిషేకం కార్యక్రమానికి తెలంగాణ మొట్ట మొదటి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది.. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు కూడా రావాల్సిందిగా కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించారు యాదగిరిగుట్ట ఆలయ పూజారులు, అధికారులు. ఈ నెల 23న ఆలయ స్వర్ణవిమాన గోపురానికి మహా కుంభాభిషేకం ఉండనుంది.. మార్చి 1 నుంచి 11 వరకు శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ తరుణంలోనే… యాదగిరిగుట్ట మహాకుంభాభిషేకం కార్యక్రమానికి తెలంగాణ మొట్ట మొదటి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. అయితే… కేసీఆర్‌ కట్టిన గుడికి ప్రతిపక్ష హోదాలో ఆయన వస్తారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version