టెన్త్ ఫిజిక్స్ లో మంచి మార్కులు రావాలంటే ఇలా తప్పక చెయ్యాలి..

-

కరోనా కారణంగా గత రెండేళ్ళు ఎటువంటి ఎగ్జామ్స్ లేవు. ఈ ఏడాది ఎగ్జామ్స్ ను అధికారులు నిర్వహిస్తున్నారు. తాజాగా టెన్త్ ఎగ్జామ్స్ ను మొదలు పెట్టారు..అయితే క్లాసులు జరగని నేపథ్యంలో సిలబస్ ను కూడా తగ్గించిన విషయం తెలిసిందే.ప్రశ్నాపత్రాల కూర్పు కూడా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు అందిస్తున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట జిలా ఉర్లుగొండ జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు అచ్చ స్వప్న అందించిన ఫిజిక్స్ మంచి స్కోర్ సాధించేందుకు టిప్స్ వివరించారు..

మొత్తం పార్ట్ ఏ, పార్టీ బీగా పేపర్ విభజింపబడుతుంది. పార్ట్ ఏలో మూడు సెక్షన్లు ఉంటాయి.

*మొదటి సెక్షన్లో 6 ప్రశ్నలు ఉంటాయి. అందుటో మూడు రాయాలి. ఒక్కో ప్రశ్నలకు రెండు మార్కులు మొత్తం 3*2=6మార్కులు.

*సెక్షన్ 2 లో 4 ప్రశ్నలు ఉంటాయి. అందులో 2 రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు మొత్తం 2*4=8 మార్కులు.

*సెక్షన్-3లో 4 ప్రశ్నలు ఉంటాయి. రెండింటికి సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు. మొత్తం 2*8=16. మార్కులు.

పార్ట్ బి లో..

పార్ట్ బీలో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. 10*1=10..

ఇంకా మంచి మార్కులు రావాలంటే..

*బేదాలు అడిగినప్పుడు అలానే విడిగా రాయకుండా టేబుల్ వేసి రాయడం మంచిది..

*కిరణరేఖా చిత్రాలను ప్రతిబంబ లక్షణాలను ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి.

*ఈ సారి సిలబస్ లో 30 శాతం సిలబస్ ను తొలగించారు. మానవుని కన్ను రంగుల ప్రపంచం పాఠ్యంశంలో కాంతి పరిక్షేపణం, రసాయనబంధం, విద్యుదయస్కాంతం, కార్బన్ దాని సమ్మేళనాలు తొలగించారు. విద్యార్థులు ఇది దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి.

*ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, విద్యుత్ ప్రవాహం, గోళాకర దర్పణాలతో కాంతి -పరివర్తనం పాఠ్యాంశాలతో పట్టికలను బాగా చూపించాలి..

పైన తెలిపిన విషయాలను గుర్తుంచుకొని పరీక్షలు రాస్తే మంచి మార్కులు రావడంతో పాటు అత్యున్నత ర్యాంకులను పొందవచ్చు…

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version