డిఫెన్స్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ లో ఖాళీలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆర్గనైజేషన్‌ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆర్గనైజేషన్‌ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ని తీసుకు వచ్చింది.

భారత రక్షణ శాఖకు సంబంధించిన ఈ సంస్థలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 97 ఉద్యోగ ఖాళీలు వున్నాయి. గ్రేడ్-2 సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు 89 ఉండగా జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఉద్యోగ ఖాళీలు 7, హిందీ టైపిస్ట్ జాబ్ 1 ఉంది.

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం అప్లై చేసుకోచ్చు. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

పదో తరగతితో పాటు, సర్వేయింగ్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌ ను కలిగి ఉన్నవాళ్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ స్కిల్స్ వున్నవాళ్లు టైపిస్ట్ పోస్టుకు అప్లై చేసుకోచ్చు. https://www.dgde.gov.in/ వెబ్ సైట్ ద్వారా మీ యొక్క సందేహాల్ని క్లియర్ చేసుకోచ్చు. అభ్యర్థులు ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌, డిఫెన్స్‌ ఎస్టేట్స్‌, సధరన్‌ కామండ్‌, కోడ్వా రోడ్‌, పుణె – 411040 అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version