బిగ్‌బాస్ హౌస్‌: ఈ వారం అవుట్ ఎవ‌రో తేలిపోయింది….

-

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నాలుగు వారాలు పూర్తి చేసుకుని నలుగురు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం అయిదవ వారం జరుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలిమినేట్ అయిన వారు చూస్తే తొలి వారం హేమ‌, రెండో వారం టీవీ 9 యాంక‌ర్ జాఫ‌ర్‌, మూడో వారం త‌మ‌న్నా సింహాద్రి, నాలుగో వారం రోహిణి ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం హౌస్‌లో 12 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.

ఈ అయిదవ వారంలో ఎలిమినేషన్స్‌లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారు ఎవరంటే రాహుల్‌, పునర్నవి, బాబా భాస్కర్‌, మహేష్‌ విట్టా, హిమజ, అషు, శివజ్యోతి. వీరిలో ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారు అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఈ ఏడుగురిలో రాహుల్‌ మరియు అషు రెడ్డిలు వీక్‌ కంటెస్టెంట్స్‌గా అనిపిస్తున్నారు.

రాహుల్‌ టాస్క్‌ల విషయంలో సీరియస్‌గా ఉండటం లేద‌న్న కంప్లెంట్లు ఎక్కువుగా ఉన్నాయి. అంతెందుకు తాజాగా మీరు ఎవ‌రిని ఎలిమినేట్ చేస్తారు ? అని బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో ఎక్కువ మంది రాహుల్‌నే నామినేట్ చేశారు. రాహుల్‌కు ఏకంగా ఆరు ఓట్లు ప‌డ్డాయి. ఇక రెండు, మూడు స్థానాల్లో హిమ‌జ‌, అషురెడ్డి ఉన్నారు.

ఇంటి స‌భ్యులు కూడా రాహుల్ విష‌యంలో చాలా అసంతృప్తితో కూడిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరికి రాహుల్‌ పట్ల సాఫ్ట్‌ కార్నర్‌ ఉంది. పులిహోర రాజా అనే ట్యాగ్‌ అతడికి ఉపయోగపడుతుందనే అంచనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో రాహుల్‌కు పాజిటివ్‌గా ఓ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయ్యింది.

ఇక అన్షు విష‌యానికి వ‌స్తే ఆమె టాస్క్‌ల్లో ఎక్కువగా సీరియస్‌గా కనిపించక పోవడంతో పాటు, ఆమెకు స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువగా ఉండటం లేదు. అందుకే ఆమెకు ఓట్లు వేసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు అంటున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం కనుక నిజం అయితే జూనియర్‌ సమంత అంటూ ఎంట్రీ ఇచ్చిన అషు ఈ వారం బయటకు రావడం ఖాయం అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version