ఆటో: టాటా కర్వ్ EV కార్ విశేషాలు, ప్రత్యేకతలు ఇవే

-

ఈ సంవత్సరం టాటా మోటార్స్ నుండి టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ అయింది. 2024 ఆగస్టు 7వ తేదీన అధికారికంగా మార్కెట్లోకి లాంఛ్ అయ్యింది టాటా కర్వ్.

ఎస్ యు వి కార్లయిన హుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి వాటికి పోటీగా టాటా కర్వ్ ఈవీ లాంచ్ అయ్యింది. దీని ధర 17.49 లక్షల నుండి 21.99 లక్షల (ఎక్స్ షోరూమ్( వరకు ఉంది.

టాటా కరువు ప్రత్యేకతలు:

  • 18 అంగుళాల చక్రాలు, 190 mm ల గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన టాటా కరువు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.
  • 45, 55 కిలో వాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ వేరియంట్లతో 500 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంది. వేగంగా ఛార్జ్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
  • ఐదుగురు సౌకర్యంగా కూర్చునేందుకు అవకాశం కలదు. 9అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్, 360డ్రిగ్రీల్లో కెమెరా, పనోరమిక్ సన్ రూఫ్ కలదు.
  • భారత్ NCAP క్రాష్ టెస్ట్ లో టాటా కర్వ్ ఈవీ ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఐదు రంగుల్లో టాటా కర్వ్ ఈవీ ఇండియాలో అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version