Bigg Boss Telugu 3 Episode 15: జాఫర్ ఔట్… వరుణ్, వితిక సేఫ్.. సర్ ప్రైజ్ గెస్టుల ఎంట్రీ..!

-

మన టీవీలో వెళ్లగానే… నాగ్ ప్రెండ్ షిప్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. అందరికీ ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు చెప్పి ఫ్రెండ్ షిప్ బ్యాండ్లను ఇంటి సభ్యులలో తమకు నచ్చిన ఇంటి సభ్యుడికి కట్టాలని చెబుతారు నాగ్.

యాజ్ యూజువల్… 15వ ఎపిసోడ్ లో నాగ్ ఇరగదీశారు. మామూలుగా కాదు… ఆయన హోస్టింగ్ అదిరిపోయింది. స్టేజీ మీదికి రావడం రావడంతోనే మెరిసిపోయారు నాగ్. అయితే ఈసారి నలుగురు కంటెస్టెంట్లు వితిక, వరుణ్, పునర్నవి, జాఫర్ లలో ఎవరో ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందే కాబట్టి… అంతా టెన్షన్ తో గడిపారు.

అయితే.. మన టీవీలో వెళ్లగానే… నాగ్ ప్రెండ్ షిప్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. అందరికీ ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు చెప్పి ఫ్రెండ్ షిప్ బ్యాండ్లను ఇంటి సభ్యులలో తమకు నచ్చిన ఇంటి సభ్యుడికి కట్టాలని చెబుతారు నాగ్.

ఆ తంతు జరుగుతుండగానే మధ్యలో ఎలిమినేషన్ లో ఉన్న నలుగురిలో ఒకరిని సేవ్ చేస్తారు నాగ్. ఆ నలుగురిలో పునర్నవి సేవ్ అవుతుంది.

తర్వాత ఇక మిగిలింది వితిక, వరుణ్, జాఫర్. వీరిలో ఎవరు సేఫ్ అయ్యారో ఓ సర్ ప్రైజ్ గెస్ట్ చెబుతాడు. ఆ సర్ ప్రైజ్ గెస్ట్ ఎవరో కాదు.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. అవును.. రామ్.. బిగ్ బాస్ స్టేజీ మీదికి వచ్చి మనటీవీలో ఇంటి సభ్యులతో కాసేపు సరదాగా గడిపాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఇంటి సభ్యులతో కాసేపు సరదాగా గడిపింది.

మిగిలిన ముగ్గురు ఇంటి సభ్యులలో వరుణ్ సేఫ్ అని రామ్ చెబుతాడు. దీంతో ఇంటి సభ్యుల్లో టెన్షన్ మరింత పెరిగిపోతుంది. విపరీతంగా పెరిగిపోతుంది. మిగిలింది వితిక, జాఫర్. ఈ ఇద్దరిలో ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతారు.. అన్న టెన్షన్ ను ఇంటి సభ్యులు తట్టుకోలేకపోయారు.

ఇక.. కాసేపు గెస్టులు ఇంటి సభ్యులను అలరించి బైబై చెప్పి వెళ్లిపోతారు. ఇక.. అసలు టెన్షన్ అప్పుడు ప్రారంభం అవుతుంది. మిగిలిన ఇద్దరు కుటుంబ సభ్యుల్లో వితిక సేఫ్ అని నాగ్ చెప్పగానే… జాఫర్… తన బట్టలు సర్దుకొని ఇంటి సభ్యులందరితో సెల్ఫీ దిగి ఇంటి నుంచి వెళ్లిపోతాడు.

అయితే… జాఫర్ వెళ్తుంటే బాబా భాస్కర్, శ్రీముఖి, శివజ్యోతి, మహేశ్ తట్టుకోలేక ఏడ్చేస్తారు. అయినా కూడా వాళ్లందరినీ ఓదార్చుతూ వరుణ్… నువ్వు బాబా భాస్కర్ ను ఏమనొద్దు.. అంటూ చెబుతూ వెళ్లిపోతాడు.

ఆ తర్వాత నాగ్ దగ్గరికి వచ్చి… జాఫర్ మనటీవీలో ఇతర ఇంటి సభ్యులతో ముఖాముఖి నిర్వహించి.. అంటే కొన్ని కొంటె ప్రశ్నలు అడిగి… నాగ్ తో సెల్ఫీ దిగి వెళ్లిపోతాడు. దీంతో 15వ ఎపిసోడ్ సమాప్తం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version