తెలంగాణ రాష్ట్ర కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. సింగూర్ ప్రాజెక్టుకు మాజీ మంత్రి, దివంగత నేత సిలారపు రాజనర్సింహ పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినేట్. ఈ మేరకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. ముఖ్యంగా రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు జనవరి 26, 2025 నుంచి అమలవుతాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ, ఫిబ్రవరి నుంచి లబ్దిదారులకు రేషన్ బియ్యం, 200 కొత్త గ్రామపంచాయతీలు, 11 నూతన మండలాలకు ఆమోదం, పెండింగ్ లో ఉన్న ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు.. త్వరలోనే గవర్నర్ కు ప్రతిపాదనలు, వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్.