భూమి లేని రైతు కూలీలకు ప్రతీ ఏటా 12 వేలు

-

భూమి లేని రైతు కూలీలకు ప్రతీ ఏటా 12 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకి ఇస్తామని తెలిపారు. తాజాగా జరిగిన కేబినేట్‌ మీటింగ్‌ తర్వాత ఈ ప్రకటన చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.

12 thousand every year for landless farmer labourers

సింగూర్ ప్రాజెక్టుకు మాజీ మంత్రి, దివంగత నేత సిలారపు రాజనర్సింహ పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినేట్‌. ఈ మేరకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. ముఖ్యంగా రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు జనవరి 26, 2025 నుంచి అమలవుతాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version