బిగ్‌బాస్ 3 కొత్త హోస్ట్ ర‌మ్య‌కృష్ణ అప్పుడే షాక్ ఇచ్చిందే…

-

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజ‌న్ `బిగ్‌బాస్ 3` ప్ర‌స్తుతం స్టార్‌మా ఛానెల్‌లో ప్ర‌సారం అవుతుంది. ఇప్ప‌టికే ఐదు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ రియాల్టీ షో తాజాగా ఆరో వారం ఎండింగ్‌కు చేరుకుంది. షో ఎన్నో వివాదాల‌తో న‌డుస్తోంది. ఈ సీజ‌న్‌కు టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్రతి శ‌ని, ఆదివారాల్లో నాగార్జున హౌస్‌మెట్స్‌కు వార్నింగ్ ఇస్తూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదం పంచుతున్నారు.


అయితే ఈ వారం నాగార్జున ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉండ‌డం లేదు. అందుకు కారణం ఆయ‌న త‌న పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ కోసం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్పెయిన్ వెళ్లారు. దీంతో బిగ్‌బాస్ 3 ఆరో వారంలో నాగ్ లేక‌పోవ‌డంతో ఎవ‌రు ఈ వారం హోస్ట్‌గా చేస్తారు ? అన్న సందేహాలు వ‌చ్చాయి. ఈ లిస్టులో రెండో సీజ‌న్ హెస్ట్ చేసిన నేచుర‌ల్ స్టార్ నాని, సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి.

స్టార్ మా యాజమాన్యం ఈ వార్తలకు చెక్ పెడుతూ బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా శివగామిని తీసుకొచ్చారు. అందుకు  సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇదిలా ఉంటే ప్రోమోలోనే శివ‌గామి షాక్ ఇచ్చింది. బాహుబ‌లి సినిమాలోని ఇదే నా మాట‌.. నా మాటే శాస‌నం అన్న డైలాగ్‌తో గంబీరంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూస్తుంటే హౌస్‌లో ఈ రెండు రోజులు హౌస్‌మెట్స్‌ను ఆడుకోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి శివ‌గామి ఏం చేస్తుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version