టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో అందరికీ తెలిసిందే. పునాదిరాళ్ళు సినిమా నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముళ్ళ బాటని పూల బాట చేశారు. చిరంజీవి నుంచి సుప్రీం హీరో…మెగస్టార్ చిరంజీవి ..ఇలా స్టార్ డం ని సంపాదించుకున్నారు. ఒకానొక స్టేజ్ లో సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న టాలీవుడ్ హీరోగా చిరంజీవి రికార్డ్ ని సాధించారు.
అంతేకాదు చిరంజీవి నటన..డాన్స్ కి నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న లెజెండ్ యాక్టర్స్ అయిన అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి వాళ్ళు బహిరంగంగా చిరంజీవిలా మేను డాన్స్ లో గాని యాంటింగ్ లో పోటీ పడలేమని వెల్లడించిన సందర్భాలున్నాయి. అంతటి పాపులారిటీని తెచ్చుకున్న చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్దన్నయ్యగా ఉంటూ ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీకి ఏది కావాలన్న ముందుండి సాధించి పెడుతున్నారు.
అలాంటి గొప్ప వ్యక్తికి కొడుకుగా పుట్టిన రాం చరణ్ తండ్రి బాటలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నటన లో డాన్స్ లో మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పాపులారిటీని సాధించాడు. ఏ హీరోకైనా బ్యాగ్రౌండ్ అనేది మొదటి సినిమాకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నుంచి తన సొంత నిర్ణయాలతోనే స్టార్ అవ్వాలి. అదే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సవాల్. అలాంటి సవాల్ ని రాం చరణ్ ఎంతో కష్టపడి ఎదుర్కొన్నాడు. చిరంజీవికి దాదాపు 7-8 సినిమాల తర్వాత వచ్చిన క్రేజ్ అండ్ స్టార్ డం ని రాం చరణ్ రెండవ సినిమాతోనే సాధించి ఇండస్ట్రీ మొతాన్ని ఆశ్చర్య పరచాడు.
ప్రతీ సినిమాలో కొత్తగా తనని తాను ఆవిష్కరించుకుంటు ఎదురైనా ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ మెగా పవర్ స్టార్ అన్న పదానికి నిలువెత్తు రూపంగా నిలిచాడు. అంతేకాదు చిన్న వయసులోనే నిర్మాతగా మారి ఎవరూ చేయని సాహసం చేశాడు. తండ్రి మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 కోసం సొంత గా కొణిదెల ప్రొడక్షన్స్ ని స్థాపించి సక్సస్ ఇచాడు. అంతేకాదు ఆ తర్వాత పాన్ ఇండియా లెవల్ లో తండ్రి కోసం ఎంతో రిస్క్ చేసి సైరా తో తండ్రి కల నెరవేర్చాడు.
చెప్పాలంటే చిరంజీవికి కొడుకు రాం చరణ్ ఎప్పుడు సర్‌ప్రైజ్ లు ఇస్తూనే ఉంటాడు. ఖరీదైన కారు…నచ్చిన వాచ్…ఇలా తండ్రి మనసుకి ఏది నచ్చుతుందో ఏది ఇష్టమే అవి సడన్ సర్‌ప్రైజ్ గా ఇచ్చి తండ్రి మీద తనకున్న ప్రేమ అభిమాలను చాటుకుంటాడు. ఇక కొన్ని సందర్భాలలో చిరంజీవి రాం చరణ్ లను ఎవరు చూసిన తండ్రీ కొడుకులంటే నమ్మరు .. స్నేహితులంటే నమ్ముతారన్నంతగా ఉంటారు. ఇలాంటి తండ్రీ కొడులు ఈరోజున ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.