చరిత్రలో రాఖీ : రాఖీతో ఆగిన అలెగ్జాండర్‌ యుద్ధం..

-

రాఖీ, రక్షాబంధన్‌, రాఖీ పౌర్ణమీ ఇలా రకకరకాలుగా పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమిగా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు మధ్య ప్రేమను తెలుపుతూ రాఖీ కడుతారు. రాఖీ అంటే రక్షణ బంధం. ఇది అన్నాచెల్లిళ్ల బంధానికే కాకుండా ఎలాంటి బంధానికైనా ప్రతీకగా రక్షణగా నిలబడని కోరుతూ రాఖీ కడుతారు. అసలు ఈ రాఖీ పండుగ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుంటారు. ద్రౌపది – శ్రీకృష్ణుని బంధంతో ఈ పండుగ వచ్చిందని కొందరు. మహావిష్ణువు – బలిచక్రవర్తికి మధ్య గొడవ ఆపడానికి శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రాఖీ కడుతుందని మరికొందరకు అంటారు. దీనికి చరిత్రలో మరో కథ కూడా ఉంది అదేంటో కూడా తెలుసుకోండి.

అలెగ్జాండర్‌ – పురుషోత్తముడి కథ!

అలెగ్జాండర్‌ ధైర్యవంతుడు, సాహసవంతుడు, పరాక్రమంతుడు. ఎంతటి సమరయోధిడినైనా ఓడించగల నేర్పరి. ఇతని రాజ్యం పేరు మాసిడోనియా. ఇది గ్రీకుకు చెందిన భూబాగంలోని ఒక రాజ్యం. ఇలాంటి రాజ్యాలు గ్రీకులో చాలా ఉన్నాయి. ఒకరాజ్యంతో మరో రాజ్యానికి నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉండేది. కానీ వీరికి ప్రధాన శత్రువు ఇరాన్‌ (పర్సియాన్‌ ఎంపైర్‌) ఉండేది. ఈ దేశపు అధినేత అయిన సైరస్‌ ది గ్రేట్‌ను ఓడించి అతని సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమిస్తాడు అలెగ్జాండర్‌. అలెగ్జాండర్‌ తండ్రి మరణించిన తర్వాత ఆయన తరుపున కొన్ని యుద్ధాలు చేసి ఆయా రాజ్యాలకు రాజవుతాడు అలెగ్జాండర్‌. వీరికి శత్రువు అయిన పర్సియాన్‌ను ఓడించగానే సగం ప్రపంచాన్ని గెలిచినట్టే. అలెగ్జాండర్‌ అంతటితో ఆగలేదు.

భారత్‌పై కన్నేశాడు. అప్పటి భారత్‌ అంటే ఆఫ్ఘనిస్తాన్‌, పంజాబ్‌లతో కూడింది. భారత్‌ శక్తివంతమైన దేశమని కొంతకాలం వేచి ఉన్నాడు. ఆ సమయంలో అంబి అనే తక్షశీల రాజు వచ్చి అలెగ్జాండర్‌ను కలిశాడు. ఈ అంబి పొరుగు రాజ్యం పాంచాల (ఇప్పటి పంజాబ్‌) దీనికి రాజు ‘పురుషోత్తముడు’. వీరువురుకి తీరని శత్రుత్వం ఉండేది. ఎలాగైనా పాంచాలని ఆక్రమించాలని అంబి ఆశ పడ్డాడు. కానీ పురుషోత్తముడు చాలా పవర్‌ఫుల్‌ కింగ్‌. అతడిని గెలవడం అంత సులువేం కాదు. అందుకని అలెగ్జాండర్‌ వద్ద చేరాడు అంబి. అతడిని పాంచాలపైకి యుద్ధానికి ఉసికొలుపుతాడు. అలెగ్జాండర్‌కు కావాల్సింది కూడా అదే. క్రీస్తు పూర్వం 326లో భారతదేశంపై దండెత్తుతాడు అలెగ్జాండర్‌. ఈ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్‌)కు చెందిన యువరాణి ‘రోక్సానా’ను వివాహం చేసుకుంటాడు. ఈ పెండ్లిని అడ్డుపెట్టుకొని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చి నాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. శత్రురాజు అంబి భారత్‌పై దండెత్తాలని ఆహ్వానించాడు. పురుషోత్తముడు కూడా యుద్దానికి సిద్ధమవుతాడు.

పురుషోత్తముడి గుణగణాలు, పరాక్రమం తెలిసిన రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. రాఖీ కట్టినందుకు సంతషించిన పురుషోత్తముడు రోక్సానాను తన సొంత చెల్లి అంటూ ప్రకటిస్తాడు. యుద్దం రానే వచ్చింది. పురుషోత్తముడి పరాక్రమం ముందు అలెగ్జాండర్ శక్తి సామర్థ్యాలు పని చెయ్యలేదు. అలెగ్జాండర్‌ తల పురుషోత్తముడి కత్తికి బలి అయ్యే సమయం.. రోక్సానా రాఖీ కట్టినపుడు ఆమెకు ఇచ్చిన మాట గర్తుకు వచ్చి అలెగ్జాండర్‌ను చంపకుండా వదిలేస్తాడు పురుషోత్తముడు. చెల్లికి ఇచ్చిన మాట కోసం పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను వదిలేసినట్లు చరిత్ర చెబుతుంది.. ఆ యుద్దం అక్కడితో ఆగిపోయింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version