గురుపూజోత్సవం నాడు మీ టీచర్ కి శుభాకాంక్షలని ఇలా తెలపండి..!

-

గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

గురులో ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది. గురువు అంటే మన లోని అజ్ఞానాన్ని తొలగించేవాడని అర్ధం. గురువు విజ్ఞానం అనే వెలుతురుని మన జీవితంలో ఇస్తారు. గురువు ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతాడు. అలానే విద్యా బుద్ధులు ఇస్తారు. గురువు అంటే ఎలా ఉండాలి అనేది మన పురాణాలలో కూడా వివరించారు.

శ్రీకృష్ణుడు అర్జునుడు, చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడు, రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామిలు వంటి వాళ్ళను చూస్తే గురు శిష్యులు అంటే ఏమిటో తెలుస్తుంది. మీకు కూడా లోకం లో ఎలా నడుచుకోవాలో నేర్పిన వాళ్ళు, విద్యా బుద్ధులు ఇచ్చిన వాళ్ళు వుంటారు. మరి వారికి ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మీ గురువు గారికి ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలను ఇలా తెలపండి.

మనలోని అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞాన కాంతులను నింపి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన టీచర్ గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే మా టీచర్ గారికి హ్యాపీ టీచర్స్ డే.

బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురువు గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు అని మంచి భవిష్యత్తును ఇచ్చిన మాష్టారుకి కృతజ్ఞతలు.

తండ్రి తర్వాత మరో రోల్ మోడల్ అయిన మా మాష్టారు గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ స్థాయికి నేను చేరుకున్నానంటే దానికి కారణం నా గురువులే.

ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం. అది గొప్ప ఉపాధ్యాయుల చేతులోనే ఉంది.

శిల్పి తన ఉలితో రాయని చెక్కినట్లు నా జీవితాన్ని అద్భుతంగా మార్చిన మా టీచర్ గారికి హ్యాపీ టీచర్స్ డే.

ప్రపంచం లో ఓ రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తి ఉన్న ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు.

జన్మకు సార్థకత చేకూర్చే గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే.

Read more RELATED
Recommended to you

Exit mobile version