రాఘవేంద్రరావు తీసిన హిందీ సినిమాలివే.. తొలి చిత్రంలో హీరోయిన్ శ్రీదేవి కాదు తెలుసా?

-

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది అతిలోక సుందరి శ్రీదేవి అని అందరికీ తెలుసు. శ్రీదేవిని ఇంకా అందంగా చూపించిన దర్శకుడిగా రాఘవేంద్రరావు పేరు చరిత్రలో ఉండిపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాఘవేంద్రరావు తెలుగు సినిమాలే కాదు హిందీ సినిమాలూ చేశారు. అప్పట్లో ఆయన దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ కావడం విశేషం.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన తొలి బాలీవుడ్ ఫిల్మ్ లో హీరోయిన్ గా శ్రీదేవియే నటించిందని అందరూ అనుకుంటారు. కానీ, ఆ చిత్రంలో హీరోయిన్ గా శ్రీదేవి నటించింది. శ్రీదేవి కాదండోయ్.. రాఘవేంద్రరావు దర్శకత్వం లో వచ్చిన తొలి హిందీ చిత్రం ‘నిశాన’. సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేటగాడు’కు హిందీ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో హీరోగా జితేంద్ర నటించగా, హీరోయిన్ గా పూనమ్ ధిల్లాన్ నటించింది.

ఒరిజినల్ ఫిల్మ్ ‘వేటగాడు’లో హీరోయిన్ గా శ్రీదేవి నటించింది. కానీ, హిందీ రీమేక్ లో మాత్రం వేరే హీరోయిన్ నటించింది. అప్పట్లో హీరోయిన్ గా శ్రీదేవి బిజీగా ఉండటం వల్లే వేరే హీరోయిన్ ను తీసుకున్నారట. ఇక ఆ తర్వాత ప్యారలల్ గా తెలుగు సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినపుడు హిందీ సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. ‘ఫర్జ్ ఔర్ కానూన్’, ‘హిమ్మత్ వాలా’, ‘జానీ దోస్త్’, ‘తోఫా’, ‘కామ్యాబ్’, ‘నయ కదమ్’, ‘హొషియార్’, ‘మాస్టర్ జీ’, ‘ధర్మ్ అధికారి’, ‘సుహగాన్’, ‘మెరే సప్నో క రాణి’, ‘ఆమ్దానీ అత్తని ఖర్చ రూపాయియా’ సినిమాలు తీశారు రాఘవేంద్రరావు.

రాఘవేంద్రరావు ఇటీవల నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. పలు సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటంతో పాటు నటుడిగానూ ఆయన పని చేస్తున్నారు. త్వరలో ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని మహేశ్ బాబు వరకు దాదాపుగా అందరితో సినిమాలు చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version