టీచర్స్ డే : ఈ బహుమతులని మీ గురువుకి ఇస్తే బాగుంటుంది..!

-

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న గురుపూజోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే గురుపూజోత్సవ దినోత్సవం నాడు విద్యార్థులు టీచర్లకు బహుమతులు ఇస్తూ ఉంటారు. మీరు కూడా మీ టీచర్ కి బహుమతిని ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ ఐడియాస్ మీకు బాగా వర్కవుట్ అవుతాయి.

మరి టీచర్స్ డే నాడు టీచర్లకు ఎటువంటి బహుమతులు ఇస్తే బాగుంటుంది అనేది చూద్దాం. నిజానికి ఉపాధ్యాయులు మనకు ఎంతో స్పెషల్. వారికి ఏమి ఇచ్చినా తక్కువే కానీ ఏదో ఒకటి ఇస్తే మనకే సంతృప్తి కలుగుతుంది. అందుకనే ఈ చిన్న బహుమతుల్ని మీరు వారికి ప్రెజెంట్ చేయవచ్చు.

కాఫీ కప్:

టీచర్ మీద కోట్స్ రాసి ఉన్న కాఫీ కప్ ని మీ గురువు కి ప్రెజెంట్ చేయొచ్చు. ప్రతిరోజు ఉదయం మీ టీచర్ కి మీరు దీనివల్ల గుర్తొస్తారు కూడా.

సరస్వతి దేవి విగ్రహం:

అందమైన సరస్వతి దేవి విగ్రహాన్ని కూడా మీరు మీ టీచర్ కి బహుమతిగా ఇవ్వొచ్చు. ఇది చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. కచ్చితంగా మీ గురువుకి నచ్చుతుంది.

పెన్:

ఏదైనా మంచి కంపెనీ పెన్ ని మీరు బహుమతిగా ఇవ్వొచ్చు. టీచర్లు ఎక్కువగా పెన్నులను ఉపయోగిస్తారు కాబట్టి మీ బహుమతిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా మీరు టీచర్స్ డే సందర్భంగా మీ టీచర్ కి వీటిని బహుమతులుగా ఇవ్వచ్చు.

పెన్ స్టాండ్:

పెన్నులు పెట్టుకునే స్టాండ్ ని కూడా మీరు బహుమతి కింద ఇవ్వొచ్చు. వీటిలో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మీకు నచ్చిన దానిని ఎంపిక చేసి వారికి బహుమతిగా ఇవ్వొచ్చు.

గ్రీటింగ్ కార్డ్స్:

గ్రీటింగ్ కార్డ్స్ ని కూడా టీచర్లకి బహుమతిగా ఇవ్వొచ్చు. బయట షాపుల్లో అమ్మే గ్రీటింగ్ కార్డ్ ని కొని అయినా ఇవ్వచ్చు లేదంటే మీరు స్వయంగా తయారు చేసి అయినా ఇవ్వచ్చు.

చాక్లెట్ల బాక్స్:

చాక్లెట్లు ఇష్టపడని వాళ్ళు ఉండరు ఎవరికైనా సరే చాక్లెట్లు నచ్చుతాయి. టీచర్స్ డే సందర్భంగా టీచర్లకి చాక్లెట్ బాక్స్ ని కూడా మీరు గిఫ్ట్ గా ఇవ్వచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version