తెలంగాణకు ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం : మంత్రి కేటీఆర్

-

పోరాట యోధుడే పాలకుడై సాధించిన తెలంగాణను సగర్వంగా.. దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ తెలంగాణ నేల దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. కేవలం పదేళ్లలోనే.. వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన తెలంగాణ తోబుట్టువులందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కలెక్టరేట్​లో జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రగతిపై.. తొమ్మిదేళ్లలో సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి ప్రసంగించారు.

కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ల కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుద్దిద్దుకుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ మోడల్‌ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటుందని హర్షం వ్యక్తం చేశారు. కరోనా వంటి సంక్షోభం.. ఆర్థిక మాంద్యం ఎదురైనా తట్టుకుని తెలంగాణ ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడిందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ వందేళ్ల పాటు ఇలాగే ప్రగతి ప్రస్థానంలో కొనసాగుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version