మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

-

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.

ఇవాళ ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ అక్కడ నిర్వహించిన్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇదే వేడుకలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోతు కవిత పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను ప్రజలకు వివరిస్తున్నారు. కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో నేడు దాదాపు 85 లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరా జరుపుతూ సస్యశ్యామలం చేసిన ప్రభుత్వ కృషిని తెలిపారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. “రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ములుగును గతంలో ఎవరూ పట్టించుకోలేదు. మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే. ములుగులో ఆస్పత్రి, వైద్యకళాశాల నిర్మిస్తున్నాం. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, 24 గంటల కరెంట్ ఇవ్వాలి. రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్న రాష్ట్రం మనదే.” అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version