ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న చైతన్యకు కూడా ఈ మధ్య లక్ కలిసి రావడం లేదు. ఇక తాజాగా కస్టడీ అంటూ కొత్త కాన్సెప్ట్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది.

కోలీవుడ్‌ దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించారు. కృతి శెట్టి కథానాయిక. తెలుగు – తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైంది. కాగా, మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జూన్‌ 9 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రైమ్‌ ట్వీట్‌ పెట్టింది. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version