తెలంగాణ అప్పులు రూ.3.66 లక్షల కోట్లు : కేంద్ర మంత్రి భాగవత్‌

-

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 2023 మార్చి నాటికి రూ.3,66,306 కోట్లకు చేరనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్‌ కరాడ్‌ రాజ్యసభలో తెలిపారు. 2018 మార్చి నాటికి రూ.1.60 లక్షల కోట్ల మేర ఉన్న రాష్ట్ర అప్పులు ఆరేళ్లలో 128% పెరిగినట్లు వెల్లడించారు. బడ్జెటేతర మార్గాల్లోనూ తెలంగాణ భారీస్థాయిలో రుణాలు తీసుకున్నట్లు ఆర్థికశాఖ మరో సహాయమంత్రి పంకజ్‌చౌదరి  చెప్పారు.

ఈ రూపంలో తెలంగాణ 2021-22లో రూ.35,257.97 కోట్లు, 2022-23లో రూ.800 కోట్ల రుణం సేకరించి వాటికి సంబంధించిన అసలు, వడ్డీలను బడ్జెట్‌ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు పంకజ్‌చౌదరి  తెలిపారు. 2021-22లో దేశంలోని 28 రాష్ట్రాలన్నీ కలిపి రూ.66,640.23 కోట్ల బడ్జెటేతర రుణాలు తీసుకోగా అందులో 52.90% వాటా తెలంగాణదే ఉన్నట్లు వెల్లడించారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ గ్రాంట్లు, సహాయాల కింద 2017-18 నుంచి 2021-22 మధ్య అయిదేళ్లలో తెలంగాణకు రూ.97,011 కోట్లు బదిలీ చేసినట్లు తెలిపారు.

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి 2022 మార్చి 31 నాటికి రూ.11,935 కోట్ల విద్యుత్తు బకాయిలు రావాల్సి ఉన్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కేసింగ్‌ వెల్లడించారు. 2020లో రూ.9,320 కోట్ల మేర ఉన్న ఈ బకాయిలు 2021 నాటికి రూ.10,003 కోట్లకు, 2022 నాటికి రూ.11,935 కోట్లకు పెరిగినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version