విద్యాబుద్దులు నేర్పి పిల్లల జీవితాన్ని సన్మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే గాఢి తప్పుతున్నారు. తమలోని కామ కోరికలను తీర్చుకునేందుకు చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. వెలుగులోకి రానిఘటనలు ఇంకెన్నో ఉండొచ్చు.
తాజాగా కడప జిల్లా బద్వేల్ AVR స్కూల్‌లో లైంగిక వేధింపులకు పాల్పడిన కంప్యూటర్ టీచర్ పెంచలయ్యకు పిల్లల పేరెంట్స్ దేహశుద్ది చేశారు. విద్యార్థినులు తమకు జరుగుతున్న వైధింపులను తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో కంప్యూటర్ టీచర్ పెంచలయ్య దేహశుద్ధి అనంతరం పోలీసులు అరెస్టు చేశారు.
స్కూల్ లో లైంగిక వేధింపులు..
కడప జిల్లా బద్వేల్ AVR స్కూల్ లో లైంగిక వేధింపులకు పాల్పడిన కంప్యూటర్ టీచర్ పెంచలయ్య
తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు
కంప్యూటర్ టీచర్ పెంచలయ్యకు దేహశుద్ధి
పెంచలయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు pic.twitter.com/NqB9ZwFiVk
— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2025