ఇలాంటి అమ్మాయిలనే అబ్బాయిలు ఎక్కువ ఇష్టపడతారు తెలుసా..?

-

కొంతమంది ఈజీగా నచ్చేస్తుంటారు. కొంతమందిని చూడగానే ఇష్టపడాలని అనిపిస్తుంది. అమ్మాయిలు కనుక ఇలా ఉన్నారంటే అబ్బాయిలకి కచ్చితంగా నచ్చుతారు. ఎలాంటి అమ్మాయిలను అబ్బాయిలు ఇష్టపడతారు అనేది చూద్దాం. చాలా మంది అబ్బాయిలు కలివిడిగా ఉన్న అమ్మాయిలని ఇష్టపడతారు. అమ్మాయిలు కనుక సరదాగా కలిసిపోయినట్లయితే, ఎక్కువ సమయాన్ని గడపచ్చని అబ్బాయిలు భావిస్తారు. అలాంటి అమ్మాయిలని ప్రేమించాలని అనుకుంటారు. వాళ్లతో జీవితాన్ని గడపాలనుకుంటారు. అలాగే కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది కచ్చితంగా అబ్బాయిలకి నచ్చుతుంది.

వాళ్ళు వేసుకునే షర్ట్ బాగుంది, స్టైల్ బాగుంది ఇలా చెప్తే అమ్మాయిలు వాళ్ళని ఇష్టపడతారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇతరులు చెప్పేది వినడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు చెప్పే మాటలను ఇష్టంగా తినే వాళ్ళు పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అవుతారు. వాళ్లతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటారు. అమ్మాయిలు మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఉండడం ఫన్నీగా ఉండడం వాళ్ళతో కలిసి పోవడం వంటివి చేస్తే త్వరగా అబ్బాయిలు ఇష్టపడతారు. ఐ కాంటాక్ట్ ని కూడా ఇవ్వాలి. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే వాళ్లని అట్రాక్ట్ చేయడానికి ఐ కాంటాక్ట్ ఇస్తే కూడా సులువుగా అబ్బాయిలు అమ్మాయిల్ని ఇష్టపడతారు.

అలాగే వాళ్ళు వేసుకునే దుస్తులు ఎప్పుడూ కూడా సింపుల్ గా ఉండాలి. అలాంటప్పుడు అబ్బాయిలు వాళ్ళని ఇష్టపడతారు. అదే విధంగా సింపుల్ గా మేకప్ వేసుకుంటే కూడా నచ్చుతుంది. హెవీగా కాకుండా సింపుల్ గా ఉంటే ఈజీగా అట్రాక్ట్ అవుతారు. పదేపదే అమ్మాయిలు మాట్లాడుతున్నప్పుడు జుట్టుని ముట్టుకుంటే అబ్బాయిలకి నచ్చుతుంది. చాలా అందంగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందట. అలాగే జోక్ వేస్తే నవ్వడం చాలా ముఖ్యం. అబ్బాయిలు ఏదైనా జోక్ వేసినప్పుడు అమ్మాయిలు నవ్వకుండా అలా ఉంటే వాళ్ళకి నచ్చదు. అదే వాళ్ళు నవ్వి దాని పట్ల రెస్పాండ్ అయినట్లయితే కచ్చితంగా ఇష్టపడతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version