నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ : భట్టి

-

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అత్యంత త్వరలోనే విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటికేషన్ ఇవ్వనున్నట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలో ఖాళీ గా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని వెల్లడించారు. పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912 నెంబర్ కి కాల్ చేయండి అని సూచించారు.

ఇటీవలే భారీ వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునే చర్యలు చేపట్టామని తెలిపారు. వరదల సమయంలో శ్రమించిన విద్యుత్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను విడుదల చేస్తామని తెలిపారు. దసరా కంటే ముందుగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version