భార్యాభర్తల మధ్య సంబంధం బాగుండాలంటే వారి ఇద్దరి మధ్య ఇతరుల జోక్యం అస్సలు ఉండకూడదు. ఎప్పుడైతే మూడో వ్యక్తి భార్యాభర్తల మధ్యలోకి వస్తారో ఎన్నో విభేదాలు తలెత్తుతాయి. చాలా శాతం వరకు భార్యాభర్తలు గొడవ పడడానికి కారణం ఈ విధంగా ఇతరుల జోక్యం వలనే. అయితే తల్లితండ్రులు కూడా భార్యాభర్తల వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. నిజానికి పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు వేరువేరు ప్రపంచాలకు చెందినా సరే ఒక్కటై జీవించాల్సి వస్తుంది. కనుక వారి మధ్య ఎంతో ప్రేమ అవసరం.
చిన్న చిన్న విషయాలకు గొడవ పడడం ప్రతి ఒక్కరి జీవితంలో సహజమే. అయితే అలాంటి సందర్భాలలో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇతరులకు లేక తల్లిదండ్రులకు కొన్ని విషయాలను చెప్పకూడదు లేక అనవసరమైన విషయాలను పంచుకోకూడదు. ఎప్పుడైతే భార్యాభర్తలు మధ్యలోకి మూడవ వ్యక్తిని తీసుకువస్తారో ఆలోచనా విధానం మారిపోతుంది. అంతేకాకుండా విషయాలన్నీ పెద్దవిగా కనపడతాయి. దీంతో గొడవలు ఎక్కువై బంధం బలహీనంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆర్థిక పరిస్థితుల గురించి తల్లిదండ్రులకు చెప్పకూడదు. ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులకు చెప్పడం వలన భాగస్వామికి ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది.
కనుక ఈ విషయాలను ఎవరికీ చెప్పకూడదు. అంతేకాకుండా తల్లిదండ్రుల ముందు భాగస్వామికి తప్పకుండా గౌరవాన్ని ఇవ్వాలి. గౌరవం ఇవ్వడంతో పాటుగా ఎలాంటి అవమానాలు చేయకూడదు. ఎప్పుడైతే తల్లిదండ్రుల ముందు భాగస్వామిని అవమానిస్తారో మీ బంధం పై చాలా ప్రభావం పడుతుంది. అంతేకాకుండా భాగస్వామికి సంబంధించిన లోపాలను ఇతరులతో చెప్పకూడదు. ఎప్పుడైతే ఇలా చేస్తారో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక ఇటువంటి పొరపాట్లను అస్సలు చేయకూడదు అని గుర్తుంచుకోండి. భార్యాభర్తలు ఎప్పుడైతే వీటిని పాటిస్తారో వారి మధ్య దూరం రాకుండా ఉంటుంది. దీంతో మీ భాగస్వామితో ఎంతో దృఢమైన బంధం ఏర్పడుతుంది.