రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ మేరకు ఆయన గ్రౌండ్ లెవల్ లో పార్టీ పై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ నేతల్లో నిరుత్సాహం నెలకొందని ఆయన రిపోర్ట్స్ అందాయి. ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా లోకల్ నాయకులను తాను కలవాలని ఫిక్స్ అయ్యారు. స్థాినిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. నాలుగు జిల్లాల ప్రజా ప్రతినిధులను మంగళగిరి పార్టీ వైసీపీ కార్యాలయంలో భేటీకి ఏర్పాట్లు చేశారు.
ఈ భేటీలో భవిష్యత్ కార్యచరణ పై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో వైసీపీ బలోపేతానికి చేయాల్సిన కృషిని ప్రజా ప్రతినిధులకు జగన్ వివరించనున్నారు. అలాగే పార్టీలో మార్పులు చేర్పులపైనా నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని సైతం నేతలకు వివరించనున్నారు. రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలకైనా ఇలాగే కృషి చేయాలని జగన్ సూచించారు.