శృంగారం: సెక్సువల్ ఫ్రస్టేషన్ నుండి బయటపడే మార్గాలు..

-

సెక్సువల్ ఫ్రస్టేషన్ ( Sexual Frustration )… మీ భాగస్వామితో శృంగారం లేకపోవడం, లేక అనుకోని కారణాల వల్ల శృంగారంలో భావప్రాప్తి పొందలేకపోవడం వంటి కారణాల సెక్సువల్ ఫ్రస్టేషన్ కలుగుతుందని సెక్స్ థెరపిస్టులు చెబుతున్నారు. ఇందులో నుండి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. అందుకోసం కొన్ని మార్గాలు తెలుసుకుందాం.

చెమట చిందించండి

వ్యాయామం వల్ల శృంగార పరమైన నిరాశని దూరం చేసుకోవచ్చు. మనసు పొరల్లో ఉన్న నిరాశని దూరం చేయడానికి పొద్దున లేవగానే ఎంతో కొంత దూరం పరుగెత్తండి. దీనివల్ల మీలో కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుంది.

మీ భాగస్వామిని నిందించకండి

శృంగారంలో ఇబ్బందులు కలిగినపుడు మీ భాగస్వామిపై నిందలు వేయాల్సిన పనిలేదు. శృంగార పరమైన విషయాలన్నీ మీ ఇద్దరికీ సంబంధించినవి అయి ఉంటాయి. అందువల్ల తప్పంతా మీదే అని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే సెక్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. మీ ఆలోచనలో ఏముందో వారికి తెలియనంత వరకు ఫ్రస్టేషన్ పుడుతూనే ఉంటుంది.

మీరే ప్రారంభించండి

చాలా మంది మహిళలు మగాళ్ళే ప్రారంభించాలని చూస్తారు. కానీ, ఒక్కోసారి మీరు కూడా ప్రారంభించడం మంచి పద్దతి. ఎందుకంటే చాలాసార్లు మగాళ్ళు, మహిళలు ప్రారంభించాలని చూస్తుంటారు. దానివల్ల రతి పక్రియలో కొత్తదనం కోరుకుంటారు.

వారితో మాట్లాడండి

శృంగార పరమైన ఇబ్బందులని మీ భాగస్వామితో చెప్పుకోండి. ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. మీ ఇద్దరి మధ్య జరిగే విషయాల గురించి మనసు విప్పి మాట్లాడండి. అది మీ భాగస్వామికి మీ గురించి అర్థం అయ్యేలా చేస్తుంది.

ప్రొఫెషనల్ ని కలవండి

కొన్ని సార్లు మీ మాటలతో పరిష్కారం దొరకదు. అలాంటప్పుడు ప్రొఫెషనల్స్ ని సంప్రదించడం మంచిది. సెక్స్ థెరపిస్ట్ గానీ, లేదంటే సెక్స్ వైద్యులను గానీ సంప్రదించడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version