శృంగారానికి పునాది ముద్దు. ముద్దుతో మొదలై హద్దులు చెరిపేసి ఆ తర్వాత చెలరేగిపోవడమే శృంగారం అంటే. మరి హద్దులని చెరిపేసే ముద్దులకు శృంగారంలో హద్దులు ఉంటాయా? ఉంటే అవి ఎందుకు? హద్దుల్లేకపోతే వచ్చే నష్టాలేంటన్నది తెలుసుకోకపోతే ఏమవుతుంది? మొదలగు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముద్దుల్లో చాలా రకాలున్నాయి. తమ భాగస్వామిపై విపరీతమైన ప్రేమ కలిగినపుడు దాన్ని మాటల్లో ఎలా తెలియజేయాలో అర్థం కాని సమయంలో ముద్దు ద్వారా అర్థమయ్యేలా చేస్తారు. అప్పుడు పెట్టిన ముద్దు రెండో ముద్దుకి దారి తీసి, అక్కడి నుండి వేల వేల ముద్దుల్లో మునిగిపోయి శృంగారంలో తేలతారు.
ఐతే ఒక్కసారి శృంగారంలోకి దిగిన తర్వాత ముద్దుకి ఓ హద్దంటూ ఉండాలి. ఎందుకంటే అవతలి వారి ఫీలింగ్ అర్థం చేసుకోవాలి. ముద్దులో సున్నితత్వం ఉండాలి. భాగస్వామిని ఇబ్బంది పెట్టేలా, నొప్పి కలిగేలా ఉండకూడదు. దానివల్ల వారు మీ నుండి దూరం జరుగుతారు. ఆపై ముద్దంటే భయపడే స్థితికి వస్తారు. అందుకే ముద్దు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
ముఖ్యంగా పెదవుల మీద ఇచ్చే ముద్దుకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. సాధారణంగా ముద్దు గురించి మాట్లాడుకునేటపుడు ఎక్కడెక్కడ ముద్దు పెడితే ఎలాంటి అర్థం వస్తుందో అన్న విషయంలో సరదాగా ఇలా చెబుతుంటారు. నుదుటిపై ముద్దు పెడితే నువ్వంటే నాకిష్టమని, బుగ్గపై ముద్దు పెడితే నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలనీ, అదే పెదవులపై ముద్దు పెడితే నిన్ను విడిచి నేను ఉండలేనని అంటారు.
అందుకే పెదవుల ముద్దు పెట్టేటపుడు నోరు శుభ్రంగా ఉందా అనేది చూసుకోవాలి. ఇంకా కొరకడం లాంటివి అవతలి వారికి ఇష్టమా కాదా అన్న సంగతి తెలుసుకోవాలి. వర్షం పడేముందు మేఘాలు కమ్ముకుని, ఆ తర్వాత ఒక చినుకు భూమి మీద పడి, అది పెరిగి పెరిగి చినుకులన్నీ కలిసి సందులేని జడివానను తెచ్చినట్టు ముద్దు కూడా ముందుగా చూపులతో మొదలై మెల్లగా ప్రారంభించాలి.