పేరెంటింగ్ అనేది అతిపెద్ద టాస్క్. అదొక కళ కూడా. అందరూ దాన్ని సరిగ్గా నిర్వర్తించలేరు. ఆలనా పాలనా చూసుకోవడమే కాదు ఈ సమాజంపై వారికి ఒక దృక్పథాన్ని క్రియేట్ చేసే బాధ్యత తల్లిదండ్రులదే అయి ఉంటుంది. ముఖ్యంగా స్వేఛ్ఛ, స్వతంత్రత వారికి నేర్పించాలి. ఎవరి మీదా ఆధారపడకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకునే ఆలోచనను వారికి నేర్పించాలి. దానికోసం తల్లిదండ్రులు చేయాల్సిన పనులేంటో చూద్దాం.
అవకాశాలను అందివ్వండి
చాలాసార్లు పిల్లలు ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని పూర్తి చేసేదాకా చూస్తుండాలి. పెద్దలు చేసే పనులను అనుకరించడంలో పిల్లలు ముందుంటారు. వారి ప్రయత్నాన్ని ఆపకుండా ప్రోత్సాహం అందించాలి.
శిక్షణకు సమయం ఇవ్వండి
స్వతంత్రతకు ఒక్కరోజులో వచ్చేది కాదు. దానికోసం మీరు సమయం ఇవ్వాలి. వారికి సరిపోయే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. పిల్లలు ఏ విషయాల్లోనైనా చేసిన పని మీకు నచ్చినపుడు మరీ అధికంగా పొగడవద్దు. అలా అని అస్సలు మెచ్చుకోకుండా ఉండవద్దు.
పట్టుకు కూర్చోవద్దు
ఎప్పుడు ఏం చేస్తున్నారా అని చూస్తూ తప్పులు చేస్తే చెబుతూ ఉండవద్దు. అది అస్సలు మంచిది కాదు. తప్పులు చేయనివ్వండి. అలా అయితేనే కదా వాళ్ళకి ప్రాక్టికల్ గా అర్థం అయ్యేది. అసలు తప్పే చేయవద్దు అనుకోవడం అన్నింటికంటే పెద్ద పొరపాటు.
ఛాయిస్ తీసుకోనివ్వండి
ఒక విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకే ఇవ్వండి. అఫర్ ఇవ్వండి. ఏది ఎంచుకుంటారో వాళ్ళనే నిశ్చయించుకోనివ్వండి.
అపజయాలకు కుంగిపోవద్దు
తప్పులు జరిగాయని ఒత్తిడికి గురి అయ్యి, అది మీ పిల్లలపై పడేలా చేయవద్దు. దానివల్ల ప్రయత్నం చేయవద్దనే ఫీలింగ్ కలుగుతుంది.
సమస్యలను పరిష్కరించనివ్వండి
పాఠశాలలో అయినా పార్కులో ఆడేటపుడు అయినా సమస్యలు ఎదురైతే పరిష్కారం వారే కనుక్కునేలా ప్రోత్సహించండి.
ప్రోత్సాహం, పొగడ్త
ఒక పనిలో ఓడిపోయినప్పటికీ ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. దానివల్ల మరో ప్రయత్నం చేయాలన్న కోరిక కలుగుతుంది.
Read More:
భారత రాజ్యాంగం కల్పించిన ముఖ్యమైన హక్కులు.. తెలుసుకోండి..!
గోవా దూధ్ సాగర్ : పాల లాంటి నీటి జలపాతం.. వాహ్ ఒక్కసారైనా చూడాల్సిందే..!
దగ్గర్లోని పోస్టాఫీస్ లో “పాస్పోర్ట్” ఇలా అప్లై చెయ్యండి..!