కరోనా టెస్ట్ అని 8 తులాల బంగారం కొట్టేసారు…!

-

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా సరే విస్తృతంగా కేసుల వ్యాప్తి ఉంది. ఇక ప్రజల్లో కూడా కరోనా భయం చాలా ఎక్కువగా ఉంది. అందుకే అనుమానం వస్తే పరిక్షలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వృద్దురాలు నిలువునా మోసపోయింది. విశాఖ సీతంపేట లో ఒక ఘటన జరిగింది. కరోనా టెస్ట్ పేరుతో వృద్ధురాలికి టోకరా వేసారు.

కరోనా పరీక్షలు చేస్తామంటూ ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారం కొట్టేసారు. బీరువాలో దాచుకున్న ఏడు తులాల బంగారాన్ని చోరీ చేసారు ఇద్దరు వ్యక్తులు. వృద్ధురాలు అనుమానం వచ్చి చూడగా బంగారం అపహరించినట్లు గుర్తించింది. ద్వారక పోలీసులకు ఫిర్యాదు చేసారు ఆమె. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version