కరోనా కట్టడికి అదొక్కటే మార్గం: ఎయిమ్స్‌ డైరెక్టర్

-

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ వైరస్ కట్టడిపై ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్ రణ్‌దీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేసారు. లు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ విధిస్తున్నాయని అయితే ఆయా రాష్ట్రాల్లో కేసులు గమనిస్తే కరోనా కట్టడి విషయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయనే విషయం అర్టం అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లతో పెద్దగా ఉపయోగం లేదని అన్నారు. వీటి బదులు గతేడాది మాదిరిగానే పూర్తి లాక్‌డౌన్‌ అవసరమన్నారు.

దేశంలో పరిస్థితులు దయనీయంగా మారాయన్న గులేరియా ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో కఠిన లాక్‌డౌన్‌ అవసరమని అభిప్రాయపడ్డారు. ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల కొరత ఏర్పడుతుందని, సిబ్బంది కూడా తగ్గిపోతున్నారని, అలానే ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అందక చనిపోతున్నారని విచారం వ్యక్తం చేసారు. దేశంలో ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటంతో వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోతోందని… ప్రపంచంలో ఏ ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ తరహా పనిభారాన్ని మోయదన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించాలి లేకుంటే… దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా మార్గముంటే అమల్లోకి తీసుకురావాలని సూచించారు. టీకాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వైరస్‌లో మార్పులు జరిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ కూడా వైరస్‌ను తట్టుకోలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version