దేశమంతా ఓ ‘‘బిగ్‌బాస్‌ హౌజ్‌’’..!

-

దేశవ్యాప్త లాక్‌డౌన్ పుణ్య‌మా.. అని దాదాపు దేశ జనాభా అంతా ఇళ్లల్లోనే ఉన్నారు. లోపలివారు బయటికి, బయటివారు లోపలికి రావడానికి వీల్లేదు. ఇండియాలో లాక్‌డౌన్ వ‌ల్ల జనమంతా ఇళ్ల‌లోనే ఉంటున్నారు. అందుకే.. ఇప్పుడు దేశ‌మంతా మరో ‘బిగ్‌బాస్‌ హౌజ్‌’ లా మారింది.

ఇంట్లో ఎక్కడైనా తిరగొచ్చు. తినొచ్చు.
ఎవరి పని వారే చేసుకోవాలి.
ఇద్దరు ముగ్గురు కూర్చుని గుసగుసలు పెట్టొచ్చు.
కోపాలొస్తే తిట్టుకోవచ్చు. కొట్టుకోవచ్చు.
కాసేపటికి మళ్లీ కలిసిపోవచ్చు.

ఇంతలో బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇస్తాడు. సాయంత్రం చప్పట్లు కొట్టాలి.
టాస్క్‌ పూర్తి చేసినందుకు పొద్దున్నే వెళ్లి కూరగాయలు తెచ్చుకునే గిఫ్ట్‌ ఇస్తాడు.
ఈ వారం ఇంట్లోనుంచి ఎవరు క్వారంటైన్‌కు వెళ్తారో తెలియదు.

బిగ్‌బాస్‌కు కోపమొచ్చింది.
పదిహేను రోజులపాటు సబ్బుతో గంటకోసారి చేతులు కడుక్కుంటూనే ఉండాలి.

మళ్లీ మామూలే…!
వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఓ డాక్టర్‌. ఒకరిని తీసుకెళ్లిపోతాడు.

ఈసారి మరో టాస్క్‌.. రేపు సాయంత్రం ఇంట్లో దీపాలు పెట్టాలి.
ఎల్లుండి ఏం గిఫ్టో ఇంకా తెలియదు.

ఇంకా పన్నెండు రోజులు..!
అప్పటికి ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలియదు..!

– నల్లపురి హర్షదీప్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version