తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకానికి రైతు భరోసాగా నామకరణం చేశారు. అయితే గతంలో పట్టా ఉన్న ప్రతీ ఒక్కరికీ రైతు బంధు వచ్చేది. కానీ ప్రస్తుతం కేవలం పంట వేసిన రైతుకే రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో వ్యవశాఖ శాఖ మంత్రి తాాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం ఇవ్వడం మా ఉద్దేవం అని తెలిపారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలపై మంత్రి చర్చించారు. పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటా వినియోగించబోతున్నట్టు చెప్పారు. గ్రామాల వారీ సర్వే నెంబర్ల వారిగా సాగు వివరాలు సేకరణ చేపట్టబోతున్నట్టు తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతుల పేర్లు నమోదు చేస్తున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించే యోచిస్తున్నట్టు తెలిపారు మంత్రి. సాగు విస్తీర్ణం అంచనా వేయగల కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు మంత్రి తుమ్మల.