కొత్త ట్రెండ్: బికినీ కాదు.. ఇకపై ట్రికినీ!

-

“బికినీ” అంటే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు! దీనికి పెద్దగా వయస్సుతో సంబంధం ఉండకపోవచ్చు. గ్లామర్ ఆరబోతలకు, సన్ బాత్ సంబరాలకు, బీచ్ లలో ఉల్లాసాలకు, సినిమాల్లో హాట్ హాట్ సీన్స్ కం సాంగ్స్ కి ఈ బికినీలు కేరాఫ్ అడ్రస్ లు! మరి ఈ ట్రికినీలు ఏమిటి? పైగా… బికినీకి మరో పీస్ కలిపితే… ట్రికినీ అంటున్నారు అని ఆశ్చర్యపోకండి! ఏమీ కాదు… అందమైన బికినీలకు తోడుగా అదే కలర్ లో ఒక మాస్కు కూడా కలిపి ధరిస్తే… దాన్ని ట్రికినీ అంటున్నారు!!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… ఈ మధ్యకాలంలో కరోనా కలిగించిన భయం అంతా ఇంతా కాదు! మాస్కు లేకపోతే బయటకు వెళ్లడానికి ఏమాత్రం మనసంగీకరించని పరిస్థితి! ఈ పరిస్థితుల్లో బీచ్ ల్లో సరదాగా కాలం గడపాలనుకునేవారికోసం సెంట్రల్ ఇటలీలోని ఎలెక్సా బీచ్ వేర్ యజమాని టిజియానా… ఈ కొత్త ఆలోచన చేశారంట!

ప్రపంచంలో కొద్ది చోట్ల నిబంధనలతో కూడిన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కరోనాతో సహజీవనం చేయాలి, తప్పదు అంటున్నారు! ఈ పరిస్థితుల్లో ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని… సో ఇకపై ఏ మోడల్ డ్రెస్ వచ్చినా… దానికి మ్యాచింగ్ మాస్క్ తప్పనిసరి అనేస్థాయిలో జనాలు మైడ్ ఫిక్స్ చేసేసుకున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ఏది ఏమైనా… ఈ కొత్త ఆలోచన చేసిన డిజైనర్…. వాటి పబ్లిసిటీ కోసం వాటిని తయారు చేసి కూతుళ్లకు వేసి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసింది. దీంతో ఆ ట్రికినీలు వైరల్ అవ్వడంతో పాటు… ఆమెకు ఆర్డర్ల వెల్లువ మొదలైందట!

Read more RELATED
Recommended to you

Exit mobile version