ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. world’s leading wellness magazine Lancet కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పింది. దీనికి సంబంధించి పది కారణాలు ఇక్కడ పొందుపరిచారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి కేవలం మాస్కు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తే సరిపోదు అని అన్నారు. ఈ పేపర్ ని ఆరుగురు నిపుణులు రాశారు. వీళ్లలో యూఎస్, యూకే మరియు కెనడా నుంచి కూడా ఉన్నారు.
మొదటి కారణం:
మనుషుల ప్రవర్తన మరియు ఇంటరాక్షన్, గది సైజు వెంటిలేషన్ మరియు మరికొన్ని వాటిని పరిగణలోకి తీసుకొని ఇది గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అని నిపుణులు చెప్పడం జరిగింది.
రెండవ కారణం:
మనుషులు ఒకరినొకరు కలుసుకోకుండా క్వారంటైన్ లో వున్నా కూడా ఇది స్ప్రెడ్ అయింది.
మూడవ కారణం:
ఎవరైతే దక్కకుండా ఉన్నారో తుమ్మ కుండా ఉన్నారు వాళ్ళలో కూడా ఎటువంటి సింప్టమ్స్ లేకుండా వైరస్ వ్యాప్తి చెందిందని 33 నుంచి 59 శాతం ఎటువంటి లక్షణాలు లేకుండా వచ్చాయని అన్నారు. ఇది కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతోంది అనడానికి కారణం.
నాల్గవ కారణం :
బయట కంటే కూడా ఇంట్లో నాలుగు గోడల మధ్య లో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అన్నారు.
ఐదవ కారణం:
కరోనా రాకుండా ఉండడానికి చాలా చోట్ల పీపీఈ కిట్స్ ని ధరించారు అలా ధరించిన ప్రదేశాలలో కూడా nosocomial ఇన్ఫెక్షన్లు వచ్చాయని నిపుణులు చెప్పారు.
ఆరవ కారణం:
నిపుణుల కనుగొన్న దాని ప్రకారం గాలిలో మూడు గంటల పాటు ఈ వైరస్ ఉందని అన్నారు అయితే ఇలా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేది చాలా తక్కువ అని అన్నారు.
ఏడవ కారణం:
కరోనా వైరస్ ఎయిర్ ఫిల్టర్ లలో మరియు ఆసుపత్రుల బిల్డింగ్ డక్ట్ లో కూడా ఉన్నట్లు గుర్తించారు.
ఎనిమిదవ కారణం:
జంతువులు ఉండే కేసులలో కూడా కరోనా వైరస్ గుర్తించినట్లు చెప్పారు.
తొమ్మిదవ కారణం:
ఇది గాలిలో వ్యాపించే వ్యాధి కాదని నిరూపించడానికి ఎటువంటి బలమైన ఆధారాలు లేవు.
పదవ కారణం:
శ్వాసకోస బిందువులు లేదా ఫార్మేట్ వంటి ఇతర మార్గాల సంక్రమణకు సపోర్ట్ ఇచ్చే ఆధారాలు చాలా తక్కువ అని అన్నారు. అయితే కరోనా వైరస్ మాస్క్ వేసుకున్న సోషల్ డిస్టెన్స్ పాటించిన వస్తుందని శ్వాస ద్వారా అందరూ కూడా ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉందని నిపుణులు చెప్పారు.