ఫ్యాక్ట్ చెక్: క్లాసులని మొదలు పెడుతున్నట్టు ఢిల్లీ యూనివర్సిటీ సర్క్యూలర్ ని జారీ చేసిందా..? నిజమెంత..?

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు తెగ వచ్చేస్తున్నాయి. అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలు చూసి మోసపోకండి. స్కీమ్స్, జాబ్స్ మొదలు ఎన్నో విషయాల పై ఫేక్ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఒక వార్త వచ్చింది. అయితే ఇది నకిలీ వార్తా లేదు అంటే నిజమైన వార్తా అనేది తెలుసుకుందాం. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఢిల్లీ యూనివర్సిటీ తిరిగి యూనివర్సిటీ కిందకి వచ్చే కాలేజీలన్నిటినీ జనవరి 10న తిరిగి ఓపెన్ చేస్తున్నట్టు సర్క్యులర్ వచ్చిందని ఒక వార్త వచ్చింది. అయితే నిజంగా ఢిల్లీ యూనివర్సిటీ కళాశాలను అన్నింటినీ ఓపెన్ చేస్తోందా..? దీనిలో నిజమెంత అనేది చూస్తే…. ఢిల్లీ యూనివర్సిటీ తిరిగి మళ్లీ కాలేజీలన్నిటిని ఓపెన్ చేస్తున్నట్లు వచ్చిన వార్త ఫేక్ అంటూ పీఐబీ ఫాక్ట్ చెక్ ఒక పోస్ట్ చేసింది.

 

ఢిల్లీ యూనివర్సిటీ కూడా ఈ సర్కులర్ ఫేక్ అని చెప్పేసింది. జనవరి 10 నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కాలేజీలో ఓపెన్ అయిపోతాయి అని ఆ వార్తలో ఉంది. అయితే ఇది నకిలీ వార్త అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నకిలీ వార్తని ఎవరు ఫార్వర్డ్ చెయ్యొద్దు. అలానే నమ్మద్దు. ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీలని ఇంకా తెరవడం లేదు. వచ్చిన సర్క్యులర్ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version