ఫ్యాక్ట్ చెక్: ఇక నుండి ఉచిత వైద్య సదుపాయాలని ప్రైవేట్ ఆసుపత్రిలో పొందొచ్చా..? నిజం ఏమిటి..?

-

సోషల్ మీడియాలో నకిలీ వార్తలు బాగా కనబడుతూ ఉంటాయి. ఇటువంటి నకిలీ వార్తల వల్ల చాలా మంది మోసపోతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం స్కీములకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా వార్తలు కనపడుతుంటాయి. ఇటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నకిలీ వార్తలు కారణంగా చాలా మంది మోసపోతున్నారు తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త వచ్చింది. మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ తో ప్రభుత్వం లింక్ చేసిందని ఒక వార్త వచ్చింది. మరి ఇందులో నిజం ఎంత అనే విషయానికి వస్తే… సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ తో లింక్ చేసింది అని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది పట్టి నకిలీ వార్త మాత్రమే.

ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం లింక్ చేయలేదు. నకిలీ వార్తను చూస్తే… ఈ రెండిటినీ లింక్ చేశారని చికిత్స ని పొందడానికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం కింద ప్రభుత్వ ఆసుపత్రిలో కాదు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందచ్చని ఆ వార్తలో ఉంది.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి అనౌన్స్మెంట్ ని ఏమీ కూడా చేయలేదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే కనుక అనవసరంగా నకిలీ వార్తలని ఇతరులతో షేర్ చేసుకోవద్దు. నకిలీ వార్తలని చాలా మంది ఫార్వర్డ్ చేసి తప్పు చేస్తున్నారు. దాని వలన ఇతరులు కూడా మోసపోయే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version