GHMC కార్యాలయంలో కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్టర్లు. అయితే కమిషనర్ ను కలిసేందుకు GHMC కార్యాలయంలోకి కాంట్రాక్టర్లు వచ్చే ప్రయత్నం చేయగా.. వారిని అడ్డుకుని గేట్లకు తాళం వేశారు సెక్యూరిటీ సిబ్బంది. ఈ క్రమంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య కు ప్రయత్నం చేసాడు కాంట్రాక్టర్. కాకపోతే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అలాగే GHMC కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టర్లను అందరిని అడ్డుకున్నారు పోలీసులు. నిరసనలో కూర్చున్న కాంట్రాక్టర్లను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు పోలీసులు. అయితే అరెస్ట్ చేస్తే ఎంతవరకైనా సిద్ధం అంటున్నారు కాంట్రాక్టు నాయకులు. కమిషనర్ బయటకు రావాలని డిమాండ్ చేస్తునన్నారు వారు. బిల్లుల చెల్లింపు పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఈ క్రమంలో GHMC లో భారీగా పోలీసులను మోహరించారు. నిరసన చేస్తున్న కాంట్రాక్టర్లతో మాట్లాడి విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు..