తరచు మనకి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు కనబడుతుంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా వార్త వస్తే ఇది నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉంటాము. నకిలీ వార్తల్ని కూడా నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా సరే ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా నష్ట పోవాల్సి వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది.
ఆధార్ మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు వున్నాయి. ఆధార్ ని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మొదలు ఎన్నో వాటి కోసం మనం వాడుతూ ఉంటాము. అయితే ఆధార్ కార్డు కి సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డు ఉంటే రూ. 4,78,000 లోన్ వస్తుందని వార్త వుంది. ఆధార్ కార్డు ఉంటే రూ. 4,78,000 లోన్ ఇస్తారా..? ఇది నిజమేనా అనేది చూద్దాం. ఆధార్ కార్డు ఉంటే రూ. 4,78,000 లోన్ రావడం అనేది నకిలీ వార్తే. దీనిలో ఏ మాత్రం నిజం లేదు. ఇది వట్టి ఫేక్ వార్తే. కేంద్రం ఆధార్ కార్డు ఉంటే రూ. 4,78,000 లోన్ ని ఇవ్వడం అనేది ఫేక్ మాత్రమే.