ఫ్యాక్ట్ చెక్: ఆధార్ కార్డు ఉన్నవాళ్ళకి పీఎం స్కీమ్ తో లోన్..?

-

ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ వార్తలు వస్తున్నాయి. ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. నకిలీ వార్త ఏది అని తెలియక చాలా మంది వాటిని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు కూడా. దీని వల్ల ఇతరులు నష్టపోవాల్సి వస్తుంది. తాజాగా ఆధార్ కార్డు మీద లోన్ ఇస్తారని ఒక వార్త వచ్చింది. మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి స్కీమ్ కింద ఆధార్ కార్డు ద్వారా రెండు శాతం వడ్డీకి లోన్ వస్తుందని ఒక వార్త వచ్చింది మరి నిజంగా లోన్ వస్తుందా ఎవరు తీసుకోవచ్చు అనే ముఖ్యమైన విషయాలని ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డు తో ప్రధాన మంత్రి స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం లోన్ ఇస్తుందని వచ్చిన వార్త నిజం కాదు ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే పైగా ఒక నెంబర్ ఇచ్చి దానికి ఫోన్ చేయాలంటూ వార్త వచ్చింది అయితే ఇది నిజం కాదు.

ఆ నంబర్ కి మీరు డయల్ చేయకండి. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే చాలా మంది నకిలీ వార్తలని చూసి మోసపోతున్నారు అనవసరంగా ఇలాంటి తప్పులు చేయకండి. ఇలాంటి స్కీమ్ ఏమీ లేదు పైగా డబ్బులు కూడా రావు కనుక ఇతరులకి షేర్ చేయడం అలానే లోన్ కోసం అని ఇక్కడ ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయడం వంటివి చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version