ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ యూజర్లకి ఫ్రీగా 28 రోజులకి రీఛార్జ్..?

-

సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో నకిలీ వార్తలు మనకి సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాయి. ఇటువంటివి నమ్మితే మీరే మోసపోవాల్సి ఉంటుంది తాజాగా ఒక నకిలీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అనేది చూస్తే.. సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. అదేంటంటే నరేంద్ర మోడీ భారతీయ యూజర్లకి ఫ్రీగా 28 రోజులు 239 రూపాయల రీఛార్జ్ ని చేస్తున్నారని ఆ వార్తలో ఉంది.

నిజంగా నరేంద్ర మోడీ ఫ్రీగా మొబైల్ రీఛార్జ్ చేయిస్తున్నారా.. ఇక్కడ వచ్చిన వార్త నిజమా కాదా అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ యూజర్లకి ఎటువంటి రీచార్జిని ఫ్రీగా చేయించడం లేదు. 28 రోజులకి 239 రీఛార్జ్ చేయించడం అనేది వట్టి నకిలీ వార్త మాత్రమే.

అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పైన స్పందించి ఇది నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది ప్రతి ఒక్కరు కూడా నకిలీ వార్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది నకిలీ వార్తలు నిజం అనుకుని ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటున్నారు. కానీ అటువంటివి నమ్మితే మనమే మోసపోవాల్సి ఉంటుంది. పైగా ఉద్యోగాలని స్కీములని ఎన్నో నకిలీ వార్తలు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతున్నాయి. ఇటువంటి పుకార్లని అస్సలు నమ్మకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version