రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ ఈ రోజు మ్యాచ్ లో చాలా దారుణంగా బ్యాటింగ్ చేసింది. 200 పరుగులకు పైగా పరుగులను ఛేదించి రికార్డు విజయాలను అందుకున్న పేరున్న ముంబై ఈ స్థాయి బ్యాటింగ్ ను ఎవ్వరూ ఊహించి ఉండరు. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై బ్యాటింగ్ లో పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. మొదటి వికెట్ గా గ్రీన్ (6) తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (7) మరియు రోహిత్ (0) లను ఒకే ఓవర్ లలో దీపక్ చాహర్ అవుట్ చేసి గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య మరియు నేహాల్ వధేరా లు కాసేపు వికెట్ పడకుణ్డా అడ్డుకున్నా పరుగులను వేగంగా సాధించడంలో ఫెయిల్ అయ్యారు. వీరిద్దరో నాలుగవ వికెట్ కు 55 పరుగులను జోడించారు.
ఐపీఎల్ 2023 : ముంబై ఇండియన్స్… “వెరీ పూర్ బ్యాటింగ్ షో” !
-