సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మరి అదేంటో చూస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంతా దాస్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో మొబైల్ ఫోన్ల గురించి ఆయన చెప్పారు ఒకవేళ కనుక ఎవరైనా మొబైల్ ని దొంగలించినా లేదా మీ మొబైల్ ని పోగొట్టుకున్నా ఏం చేయాలో ఆయన చెప్పారు.
గూగుల్ పే ఫోన్ పే వంటివాటిని దొంగలించిన వాళ్ళు ఉపయోగించవచ్చని మీ మొబైల్ లేకుండా మీరు ఎలా బ్లాక్ చేయవచ్చు అనే దానిని చెప్పారు. అయితే కొన్ని నెంబర్లని బ్లాక్ చేయాలని ఆయన వీడియోలో చెప్పినట్టు వుంది. అయితే నిజానికి ఆయన వీడియో చేయలేదు.
सोशल मीडिया पर @RBI गवर्नर शक्तिकांत दास के एक वीडियो को गलत संदर्भ में साझा किया जा रहा है।#PIBFactCheck:
▶️ यह वीडियो भ्रामक है।
▶️ इस वीडियो में सुनाई दे रही यह आवाज़ आरबीआई गवर्नर @DasShaktikanta की नहीं है। pic.twitter.com/Wtl1gxGj1e
— PIB Fact Check (@PIBFactCheck) September 29, 2022
ఇది నకిలీ వీడియో మాత్రమే. మోసగాళ్ళు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఈ వీడియో చేయలేదని తెలిసింది. అనవసరంగా ఇటువంటి ఫేక్ వీడియోల బారిన పడద్దు.