ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ మరియు ఇంటర్ విద్యార్థులు పరీక్షలను ముగించుకుని సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పాలి. కానీ తెలనగానలో మాత్రం టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మరో మూడు రోజుల్లో ప్రారంభం క్నునాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే టెన్త్ తర్వాత జాయిన్ అవనున్న ఇంటర్ కోసం ఇప్పటి నుండే ధరఖాస్తులు వేసుకోవాలని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణ కుమార్ ఇదివరకే చెప్పి ఉన్నారు. కానీ ఆ గడువును మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు టెన్త్ క్లాస్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ను అందించారు.
ఇంటర్ మొదటి ఈసంవత్సరం ఎంపీసీ , ఎం ఇ సి మరియు బైపీసీ కోర్సులలో చేరాలి అనుకునే విద్యార్థులు ఏప్రిల్ 15 లోపు అప్లై చేసుకోవాలని తెలిపారు. దీనికి సంబంధించిన TSRJC పరీక్షను మే 6న నిర్వహించడానికి సిబ్బంది ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం టెన్త్ రాయబోతున విద్యార్థులు అందరూ ఈ పరీక్షకు అప్లై చేసుకోండి.