ఈ షార్ట్ కట్స్ ని ఫాలో అయితే గూగుల్ సెర్చ్ మరెంత సులభం..!

-

టెక్నాలజీ బాగా పెరగడంతో మన పనులు కూడా సులభంగా అయిపోతున్నాయి. ఎవరైనా సరే ఈజీగా తెలియని విషయాలన్నీ కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పని కూడా ఎంతో స్మార్ట్ గా పూర్తి చేసుకోవడానికి అవుతుంది. నిజానికి గూగుల్ లో మనం చాలా విషయాలను నేర్చుకోవచ్చు పైగా మనకి కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవడానికి కూడా అవుతుంది.

 

ఒక్కోసారి మనం గూగుల్ సర్చ్ చేసినప్పుడు సరైన పాయింట్లు రాకుండా అనవసరమైనవి వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం ఏదైతే వెతికామో అది పర్ఫెక్ట్ గా రావాలి అంటే గూగుల్ సర్చ్ చేసినప్పుడు ఈ షార్ట్ కట్స్ ను ఉపయోగించండి. ఈ షార్ట్ కట్స్ ద్వారా ఈజీగా గూగుల్ ని మనం ఉపయోగించుకోవడానికి అవుతుంది. మరి వాటి గురించి చూద్దాం.

గూగూల్​ సైట్​:

గూగుల్​లో ఏదైనా సెర్చ్​ చేస్తే వందల కొద్ది సైట్లు కనపడతాయి. అలా కాకుండా బ్రౌజర్​లో గూగుల్​ను ఓపెన్​ చేసి వెబ్​సైట్​కు ముందు site: అని టైప్​ చేస్తే అవే కనపడతాయి. ఇలా ఈజీగా నచ్చిన సైట్ లో సమాచారం చూడచ్చు.

కొటేషన్​ మార్క్స్:

ఒక్కోసారి పెద్ద పెద్ద పదాలు ఉంటాయి. గూగుల్​ వాటిని విడివిడిగా సెర్చ్​ చేస్తుంది. అందుకని అలా కాకుండా కొటేషన్​ మార్క్స్​ ఉపయోగిస్తే ఇన్ఫర్మేషన్ సరిగా వస్తుంది. దీనితో గూగుల్ సెర్చ్ లో మనకి కావాల్సిన దానిని క్లియర్ గా స్పీడ్ గా పొందొచ్చు.

డ్యాషెస్​:

సెర్చ్​ చేసే పదంలోంచి ఒక పదాన్ని మినహాయించాలంటే దాని ముందు హైఫన్​(-) పెడితే చాలు. ఇలా చేయడం వలన ముందు పదానికి తగ్గ ఫలితాలు కనపడతాయి. అదే మీకు పర్యాయపదాలు కావాలంటే ~ అని పదంలో పెట్టండి. music ~classes అని సెర్చ్ చేస్తే మ్యూజిక్​ క్లాసెస్​, లెసన్స్​, కోచింగ్​కు సంబంధించిన సెర్చ్​ రిజల్ట్స్​ కనిపిస్తాయి.

వెర్టికల్ బార్:

| వెర్టికల్​ బార్​ గూగుల్​లో ఏదైనా రెండు విషయాల గురించి ఒకేసారి సెర్చ్​ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. మీరు OR అని టైప్​ చేయకుండా | వెర్టికల్​ బార్​ను ఉపయోగిస్తే సరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version