బంజారాహిల్స్ పోలీసులపై ఆరోపణలు.. మ‌రో ట్విస్ట్ ఇచ్చిన అట్లూరి దంపతులు.. వీడియో

-

ఈ నెల 8న ఓ కేసు విషయంలో ఫిర్యాదు ఇవ్వడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లిన అట్లూరి సురేష్,ప్రవిజ దంపతులు.. అక్కడి పోలీసులపై సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు తమ కేసును పట్టించుకోకపోగా తనపై అత్యాచారానికి యత్నించారని ప్రవిజ ఆరోపించారు. తన భార్య పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని సురేష్ కూడా ఆరోపించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేయడంతో.. అది వైరల్‌గా మారింది.

అంతేకాదు,దీనిపై కమీషనర్‌కు ఫిర్యాదు చేయగా.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని మరో వీడియోలో పేర్కొన్నారు. అయితే అట్లూరి సురేశ్ దంపతులు తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు. తమ ఆరోపణలు అవాస్తవమని.. మతిస్థిమితం కోల్పోయి మాట్లాడామంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాము ఇష్టం వచ్చినట్లు మాట్లాడామని, మీడియా సమయాన్ని వృథా చేశామని, తమను క్షమించాలని చెప్పారు. బంజారాహిల్స్‌ పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేశామని, ఈ విషయంపై తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version