కనుమ రోజు వీటిని తప్పక తినాలి ..ఎందుకో తెలుసా?

-

తెలుగు పండగ అంటే సంక్రాంతి అన్న విషయం తెలిసిందే..తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను అత్యంత వైభవంగా చేస్తారు.భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మూడో రోజు జరుపుకునే కనుమని పశువుల పండుగ అని అంటారు. పశువులను తమ ఇంటి సంపదగా భావించి కనుమ రోజున పూజిస్తారు. పశువుల పట్ల కృతజ్ఞతను తెలుపుతూ.. రైతులు కనుమ రోజున వాటిని శుభ్రం చేసి.. అందంగా అలంకరిస్తారు. పూజ చేసి హారతి ఇచ్చి.. అతికిష్టమైన ఆహారాన్ని అందిస్తారు. ఉత్సవంగా ఊరేగిస్తారు. అంతేకాదు కనుమ రోజున కాకి అయినా కదలదని.. మినుము తినమని సామెతలు వాడుకలో ఉన్నాయి.

మూడో రోజు కనుమ అంటే గుర్తుకొచ్చేది గారెలు.. ఈరోజు కోడిని తమ ఇంటి దేవతకు నైవేద్యంగా పెట్టి.. గారెలు కోడి కూరని చేస్తారు. తమ ఇంటి పెద్దలకు వీటిని ప్రసాదంగా పెడతారు. మాంసం తినని వారికి, మంచి పోషకాలను ఇచ్చేవి మినుములు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనేది వుంది ఈ పండుగ మంచి చలిలో వస్తుంది..అందుకే మినుములు తీసుకోవడం వల్ల వేడి పెరుగుథుందని నమ్మకం..

ఇకపోతే ఈ కనుమ రోజు ప్రయాణాలు అస్సలు చెయ్యకూడదు..శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇలా పెద్దలు చెప్పడం వెనుక ఒక కారణం కూడా ఉందట. కనుమ రోజు తమ పెద్దలను తలచుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి గడుపుతారు. తమ పెద్దలను తలచుకుని ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెబుతారు.అందుకే ఈ పండుగకు కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version