బాడీ మోడిఫికేషన్ అనేది నిజానికి కొత్తేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. చాలా మంది తమ శరీరాలను రకరకాలుగా మోడిఫికేషన్లు చేయించుకుంటుంటారు. అందుకుగాను సర్జరీలు చేయించుకుంటారు. కొందరు టాటూలను వేయించుకుంటారు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లి ఏకంగా అంగంలోనే పూసలను ఇంప్లాంట్ చేయించుకున్నాడు.
మెక్సికోకు చెందిన మారిషియో డానియెల్ గార్షియాకు టాటూల పిచ్చి ఉండేది. దీంతో 18వ ఏట తన మొదటి టాటూను వేయించుకున్నాడు. తరువాత ఇప్పటి వరకు 150 సార్లు టాటూలను వేయించుకున్నాడు. తన తల్లిదండ్రులు తన బర్త్‌డేలకు ఇచ్చిన గిఫ్ట్‌ల తాలూకు టాటూలు, తన కుమార్తె పేరు, తదితర వివరాలను టాటూలుగా వేయించుకున్నాడు. అలాగే శరీరానికి పలు మోడిఫికేషన్లు కూడా చేయించుకున్నాడు. అతని నాలుకకు, ఇతర భాగాల్లో పియర్సింగ్స్ చేయించుకున్నాడు. కనుగుడ్లపై కూడా టాటూలను వేయించుకున్నాడు.
అయితే గార్షియా ఇప్పటికే తన బాడీ మోడిఫికేషన్ కోసం 4వేల పౌండ్లు (దాదాపుగా రూ.4 లక్షలు) ఖర్చు పెట్టాడు. కానీ అది సరిపోదన్నట్లు తన పార్ట్నర్కు లైంగికంగా మరింత తృప్తిని అందివ్వాలని చెప్పి రూ.3 లక్షలు ఖర్చు పెట్టి మరీ సిలికాన్ పూసలను తన అంగంలోకి ఇంప్లాంట్ చేయించుకున్నాడు. ఒక్కో పూస 0.8 సెంటీమీటర్ల సైజులో ఉంటుంది. అయితే దాని వల్ల తనకు ఎలాంటి తృప్తి లేకున్నా తన పార్ట్నర్కు తృప్తిగా ఉంటుందని అతను తెలిపాడు. తన శరీరంలో 75 శాతం వరకు టాటూలతో నిండి ఉంటుందని, అయితే ఎవరైనా సరే.. టాటూలను వేయించుకోవాలనుకున్నా.. బాడీ మోడిఫికేష్ చేయించుకోవాలనుకున్నా ఒక్కసారి ఆలోచించాలని, తనను బయటకు వెళ్తే అందరూ దెయ్యం మాదిరి చూస్తున్నారని, తాను ఇతరుల వద్ద ఉంటే వారు అసౌకర్యంగా ఫీలవుతున్నారని, కనుక ఎవరైనా ఇలా చేసే ముందు ఆలోచించాలని సలహా ఇచ్చాడు.