డ్రైవర్ లేకుండానే 90 కిలోమీటర్లు వెళ్లిన రైలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

-

అది గూడ్స్ రైలు. గూడ్స్ అంటే.. ఐరన్ ఓర్ ను తరలిస్తున్న రైలు అది. ఆస్ట్రేలియాలోని న్యూమన్ నుంచి పోర్ట్ హెడ్ ల్యాండ్ కు వెళ్తోంది. అతి పెద్ద గూడ్స్ రైలు అది. దానికి నాలుగు ఇంజిన్లు, 26 బోగీలు ఉన్నాయంటే అది ఎంత పెద్ద గూడ్స్ రైలో అర్థం చేసుకోవచ్చు. అయితే… ఓ ప్రాంతంలో రైలును ఆపిన డ్రైవర్ కిందికి దిగి బోగీలను చెక్ చేస్తున్నాడు. అంతే.. ఒక్కసారిగా దానంతట అదే స్టార్ట్ అయిన రైలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలా 90 కిలోమీటర్ల దాకా వెళ్లింది. తర్వాత పట్టాలు తప్పింది. దీంతో రైలు బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఐరన్ ఓర్ అంతా నేలపాలయింది. ఆ రైలు ఓ మూడు కిలోమీటర్ల మేర ఉంటుందట. దానికి సంబంధించిన వీడియో ఇదిగో.

Read more RELATED
Recommended to you

Exit mobile version