సాధారణంగా మందుబాబులు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు. కొంత మంది కొంచెం మద్యం సేవిస్తే.. చాలు వారు ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం దిగాక నువ్వు ఇలా చేశావని అడిగితే నేను అలా చేశానా..? అని ఆశ్చర్యకరంగా చెబుతుంటారు. కొందరూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం.
తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ మందు బాబు వింతగా ప్రవర్తించాడు. ఏకంగా నడిరోడ్డుపై కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. అతను అలాగే కుర్చీ వేసుకొని కూర్చుండగానే.. ఓ లారీ డ్రైవర్ చూడకుండా కుర్చీని గుద్దాడు. క్షణాల్లోనే తప్పించుకున్నాడు మందుబాబు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. మందు బాబులు ఇలా కూడా ఉంటారా..? అని సోషల్ మీడియాలో పలువురు చర్చించుకుంటున్నారు.