సానియా మీర్జా రెండో పెళ్లి.. టర్కీ ఫొటోలు వైరల్..!

-

భారత టెన్నీస్ లెజెండ్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. అటు మాలిక్ మరో వివాహం చేసుకున్నారు. షోయబ్ మాలిక్ నటి సనా జావేద్ ను మూడో వివాహం చేసుకున్నాడు. సానియా మీర్జా కూడా త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సానియా టర్కీ పర్యటనలో ఉన్నారు. సానియాతో పాటు టర్కీలో ఆమె స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. సానియాతో పాటు నటి పరిణితి చోప్రా, ఆమె భర్త రాఘవ్ చద్దాతో ఉన్న ఫోటోలను పరిణితి చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సానియా మీర్జా రెండో పెళ్లి గురించి ఎలాంటి విషయాలు అధికారికంగా వారి కుటుంబం నుంచి  ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే క్రికెటర్ షమీని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version